Saturday, 6 August 2011

INTERNET CONNECTION COMPLETED BY @20 YEARS


వెబ్‌సైటమ్మకు ఇరవయ్యేళ్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఇంటర్నెట్...వెబ్‌సైట్ అనేవి లేకుండా క్షణంకూడా తోచని స్పీడు యుగంలో పరుగులు పెడుతున్నాం.అవి ఎదురుగా లేకపోతే, కాలూ చెయ్యీ పడిపోయినట్టే. ఆలోచనలకూ పక్షవాతం సోకినట్టే. జీవితాన్ని, ప్రపంచ గమనాన్ని అంతగా ప్రభావితం చేస్తున్న వెబ్‌సైట్‌కు శనివారంతో ఇరవయ్యేళ్లు నిండాయి. 1991 ఆగస్టు 6వ తేదీన ప్రపంచంలో మొట్టమొదటి వెబ్‌సైట్ ఆవిష్క్రతమైంది.

ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ టిమ్ బార్నర్స్ లీ అనే కంప్యూటర్ నిపుణుడు వెబ్‌సైట్‌ను రూపొందించాడు. దీనిని చూడాలనుకునేవారు ఠీఠీఠీ.ఠీ3.ౌటజ లో చూడవచ్చు. ఇంటర్నెట్ పరిజ్ఞానం వెబ్‌సైట్‌కంటే బాగా ముందుగానే అందుబాటులోకి వచ్చినప్పటికీ, చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటుంటారు. ఇంటన్నెట్అనేది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లను అనుసంధానం చేసే ప్రక్రియ. అయితే, వెబ్‌సైట్ పరిజ్ఞానం అందుమాటులోకి వచ్చిన తరువాతే, ఇంటర్నెట్‌కూడా ప్రజాదరణ పొందింది.

మొట్టమొదటి డొమెయిన్ పేరు, సింబాలిక్స్.కామ్ అనేది 1985 మార్చి15న రిజిస్టర్ అయింది. మొదటి వెమ్ సర్వర్‌ను 1992 లో ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రపంచం మొత్తంమీద 50 సర్వర్లే ఉండేవి. ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. 1995 సెప్టెంమరు 14కు ముందు వెబ్‌సైట్ పేరునుకూడా ఉచితంగా రిజిస్టర్ చేసేవారు. ఇంటర్నెట్‌ను వినియోగించడాన్ని 'ఇంటర్నెట్ సర్ఫ ర్స్' అంటారు. ఈ పదాన్ని జీన్ ఆర్మర్ పాలీ అనే మహిళ కనిపెట్టారు.

No comments:

Post a Comment