Saturday, 6 August 2011

INDIA SUPPORT TO AMERICA FINANCIAL PROBLEMS


మనమూ అప్పు ఇస్తున్నామోచ్!

యూరప్‌కు రూ.9000 కోట్లు మంజూరు
ఆమోదానికి పార్లమెంటులో బిల్లు
ఆర్థిక సంక్షోభం నివారణకు చేయూత
గొప్ప కోసమా..!. దీర్ఘ కాలిక వ్యైహమా?
ఒక్కో మెట్టూ దిగజారుతున్న అగ్రరాజ్యం
సవాళ్లను అధిగమించి ఎగబాకుతున్న భారత్
సరిగ్గా ఇరవై ఏళ్ల కిందట.. మన దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వ చెల్లింపులకు తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి. అప్పట్లో దేశ ప్రధాని పీవీ నరసింహారావు అయితే.. ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్ ఉన్నారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అప్పు కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తలుపు తట్టింది. దేశ ఆర్థిక చరిత్రలో ఈ ఘటనను చీకటి కోణంగా అభివర్ణిస్తూ ఉంటారు.

సరిగ్గా.. 20 ఏళ్ల తర్వాత.. అప్పటి ఆర్థిక మంత్రే నేటి ప్రధాని. అప్పట్లో అప్పు కోసం ఐఎంఎఫ్ తలుపు తట్టిన మన దేశం.. ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న యూరప్ దేశాలకు రెండు వందల కోట్ల డాలర్లు (దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు) అప్పు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఇందుకు అంగీకరించాలంటూ మంగళవారం ప్రభుత్వం పార్లమెంట్‌ను కోరింది. అయితే, మన దేశ అసలు పరిస్థితి ఏమిటి? 'మింగ మెతుకు లేదు. మీసాలకు సంపెంగ నూనె' తరహాలో ప్రపంచ దేశాలకు మన గొప్ప చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? లేక సూపర్ పవర్‌గా ఎదగాలనే ఆకాంక్షలో ఇదొక వ్యూహమా?

అగ్రరాజ్యం.. ప్రపంచంలోనే పటిష్ఠమైన ఆర్థిక శక్తి అయిన అమెరికా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దానినుంచి బయట పడేందుకు.. మరింత అప్పు తీసుకొనేందుకు ఆమోదం పొందడానికే ఆ దేశం అతలాకుతలమైపోయింది. తాజాగా, అమెరికా క్రెడిట్ రేటింగ్ కూడా పడిపోయింది. 'ఏఏఏ' నుంచి 'ఏఏ ప్లస్'కు దిగజారింది. ఇక, గత రెండేళ్లుగా యూరప్‌లోని వివిధ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

దీంతో, ఆయా దేశాలను సంక్షోభం నుంచి బయట పడేయడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందుకు న్యూ అగ్రిమెంట్స్ టు బారో (ఎన్ఏబీ) అనే ఫండ్‌ను కూడా ఏర్పాటు చేశాయి. ఈ ఫండ్‌కు ప్రపంచంలోని శక్తిమంతమైన రాజ్యాల కూటమి జీ-20 తనవంతు ఆర్థిక సా యాన్ని అందించింది. ఈ ఏడాది మార్చినాటికి ఎన్ఏబీ నిధి 5000 కోట్ల డాలర్లకు (రూ.2,25,000 కోట్లు) చేరుకుంది. అభివృద్ధి చెందిన దేశాలు అందించే సాయంతో యూరప్ దేశాలు ఈ సంక్షోభం నుంచి బయటపడగలవని అందరూ భావించారు.

కానీ, పరిస్థితి తారుమారైంది. ఈ నిధి నుంచి గ్రీసు దేశానికి ఇప్పటి దాకా 3000 కోట్ల డాలర్లు (రూ.1,35,000 కోట్లు) అందాయి. పోర్చుగీసుకు 1000 కోట్ల డాలర్లు (రూ.45,000 కోట్లు) అందాయి. అయినా, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే, అమెరికా ఆర్థిక సంక్షోభం కూడా యూరప్‌పై తీవ్రమైన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ మరిందరు దాతల సాయం అర్థించింది. అభివృద్ధి చెందుతున్న 13 దేశాలను ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీనికి మన సర్కారూ సానుకూలంగా స్పందించింది. 200 కోట్ల డాలర్లు ఇవ్వడానికి అంగీకరించింది.

యూరప్ సమస్యేమిటి?
యూరప్‌లోని దేశాలన్నీ బలమైన ఆర్థిక ప్రగతిని సాధించాలంటే అన్నీ కలిసి ముందుకు సాగాలనే సిద్ధాంతం పైకి బాగానే కనిపిస్తుంది. కానీ, ఆయా దేశాలకు అనేక వ్యక్తిగత సమస్యలున్నాయి. వాటి వృద్ధి రేటు, ఉత్పాదకత, రుణాలను తీర్చే విధానాలు, వడ్డీ రేట్లు, న్యాయ వ్యవస్థ పనితీరు, కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు అనుసరించే వ్యూహాలు ఒక దానితో మరొకటి పొసగవు. అంతేకాకుండా.. ద్రవ్యోల్బణం రేటు వేర్వేరుగా ఉంటుంది.

No comments:

Post a Comment