Wednesday, 10 August 2011

ఎమార్ అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాలు పూర్తి స్థాయి దర్యాప్తునకు సి.బి.ఐ.కి హై కోర్టు ఆదేశం


ఎమార్ అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాలు
పూర్తి స్థాయి దర్యాప్తునకు సి.బి.ఐ.కి హై కోర్టు ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 10 : ఎమార్ ప్రాపర్టీస్ అనేక అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హై కోర్టు ప్రకటించింది. ఎమార్ అక్రమాలపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరపాలని సి.బి.ఐ.కి హై కోర్టు బుధవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఎమార్ కంపెనీపై క్రిమినల్ కేసు దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఎమార్ వ్యవహారాల దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం భూముల పరిరక్షణ విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదని కూడా కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది.

ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎ.పి.ఐ.ఐ.సి. పూర్తిగా విఫలమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గాక ఒక ప్రయివేటు సంస్థకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరించారని కోర్టు తీవ్రంగా విమర్శించింది. భూములను ఒక ప్రయివేటు కంపెనీ తన ఇష్టం వచ్చినట్టు తన్నుకుపోతుంటే ప్రభుత్వం మిన్నకుండడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఎమార్ వ్యవహారంలో బి.పి.ఆచార్య వంటి అధికారులను సి.బి.ఐ. విచారించిన విషయం తెలిసిందే.

1 comment:

  1. TQ FOR AP HIGH COURT.ONLY FEW DAYS WAIT JAGAN GO TO JAIL.

    ReplyDelete