Tuesday, 16 August 2011

జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ రెడీ


ముప్పేట దర్యాప్తు!
జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ రెడీ
చిత్తు ప్రతిని ఢిల్లీ తీసుకెళ్లిన సీబీఐ అధికారులు

నేడో రేపో ఎఫ్ఐఆర్ జారీ చేసే అవకాశం
దేశ రాజధాని నుంచే అధికారిక ప్రకటన!
జగన్ కేసు విచారణకు ఎండీఐటీ?
ఎమ్మార్ కేసులోనూ ఎఫ్ఐఆర్ సిద్ధం
మళ్లీ సుప్రీం మెట్లెక్కిన జగన్
బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయొద్దు
మా వాళ్లను అరెస్టు చేయవద్దు
హైకోర్టు తీర్పును నిలిపివేయండి
మళ్లీ దానిని హైకోర్టుకు పంపొద్దు
మీ దగ్గరే పెండింగ్‌లో ఉంచండి
సుప్రీంకు జగన్ మొర
హైదరాబాద్, ఆగస్టు 16: కడప ఎంపీ వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు ఎఫ్ఐఆర్ జారీకి సీబీఐ రంగం సిద్ధం చేస్తే.. హైకోర్టు తీర్పును నిలిపి వేయాలంటూ జగన్ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. జగన్ కేసు విచారణకు బహుళ వ్యవస్థల దర్యాప్తు బృందాన్ని (మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్-ఎండీఐటీ) ఏర్పాటు చేయడానికి సీబీఐ పావులు కదుపుతుంటే.. తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయవద్దని, తమ వాళ్లను అరెస్టు చేయవద్దని జగన్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

హైకోర్టు తీర్పును నిలిపి వేయాలని విన్నవించారు. అయితే.. జగన్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు, తమ వాదనలు వినాల్సిందిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో, జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ మరోసారి ఊపందుకుంది. ఇక, ఎమ్మార్ సంస్థ కూడా జగన్ బాటలోనే నడిచింది. తమ సంస్థపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ సీబీఐని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

జగన్ అక్రమ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ అవకతవకల వ్యవహారంపై సిద్ధమవుతున్న ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను బుధ, గురు వారాల్లో జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సీబీఐ అధికారులు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో అనేకమంది వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉండడంతో ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో సీబీఐ అధికారులు ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నట్లు తెలిసింది.

ఈ రెండు కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ చిత్తు ప్రతి సిద్ధమైందని, దానిని తీసుకుని సీబీఐ ఉన్నతాధికారుల బృందం మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లిందని తెలిసింది. చిత్తు ప్రతిని సీబీఐ డైరెక్టర్‌కు చూపించిన తర్వాత, బుధ, గురు వారాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, జగన్ అక్రమ ఆస్తులు, ఎమ్మార్ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడానికి సీబీఐ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సత్యం రామలింగరాజు కేసు విచారణ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎండీఐటీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అదే విధంగా, ఈ రెండు కేసులకు సంబంధించి కూడా ఎండీఐటీని ఏర్పాటు చేయాలని సీబీఐ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆదాయ పన్ను శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆడిటింగ్ , సెబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ తదితర విభాగాలకు చెందిన సీనియర్ అధికారులతో ఎండీఐటీని ఏర్పాటు చేస్తే దర్యాప్తు వేగవంతమవుతుందని సీబీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి మంత్రి శంకర్‌రావు ఇటీవల సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎండీఐటీ ఏర్పాటు తథ్యమనే సంకేతాలు ప్రభుత్వ వర్గాల ద్వారా వస్తున్నాయి. ఎండీఐటీ ఏర్పాటు.. ఎఫ్ఐఆర్ జారీకి సంబంధించి అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి సీబీఐ డైరెక్టర్ చేయవచ్చని తెలుస్తోంది.

మరోసారి సుప్రీంకు
తన కంపెనీల్లో పెట్టుబడులు, తన ఆస్తులు, సంపాదనలపై పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు కాకుండా నిలిపి వేయాలని జగన్ మంగళవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను నేరస్తుడిగా నిర్ణయించిన హైకోర్టు తీర్పు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు నివేదించకుండా సుప్రీంలోనే పెండింగ్‌లో ఉంచాలని కోరారు.

న్యాయస్థానం తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయవద్దని, ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీల అధికారులను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించాల్సిందిగా అభ్యర్థించారు. హైకోర్టు తన తీర్పులో ఎలాంటి నిర్దిష్ట నిర్థారణలకు రాలేదని, కేవలం సాధారణ వ్యాఖ్యలే చేసిందని తెలిపారు. సీబీఐ ప్రాథమిక దర్యాప్తుపై తన వాదనలను వినకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రికార్డులను కోరకుండానే తీర్పు వెలువరించిందని చెప్పారు.

హైకోర్టు తనను తాను పరిశోధక సంస్థ పాత్రలో నియమించుకుందని, తనను నేరస్థుడిగా నిర్థారించిందని విమర్శించారు. సీబీఐ దాఖలు చేసిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను కూడా హైకోర్టు కనీసం తనకు ఇవ్వలేదని, సీల్డు కవర్‌లో ఉన్న నివేదికను తెరిచి తిరిగి సీలు చేసిందని ఆరోపించారు. సీల్డు కవర్‌ను హైకోర్టు తాను మాత్రమే తెరవడమే కాకుండా, తన తీర్పుకు సీబీఐ నివేదిక ఆధారం కాదని ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. 

Monday, 15 August 2011

ABOUT NTR


NTR

ఈ రోజు చిత్రము


ఈ రోజు వీడియో

చిత్రం పేరు : ఆత్మబందువు
నిర్మాత : _
దర్శకుడు : రామకృష్ణ
నటీనటులు : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీరామారావు,సావిత్రి
విడుదల తేది : 14-12-1962



మరిన్ని సినిమాలు >>


Sunday, 14 August 2011

INDEPENDENCE DAY


Independence Day (India)

From Wikipedia, the free encyclopedia
Independence Day
Independence Day
The national flag of india, on the Red fort in Delhi; a common sight on public and private buildings on national holidays like the 15th of August.
Also calledThe Fifteenth of August
TypeNational
SignificanceThe day India became independent from British rule.
DateAugust 15
CelebrationsFlag hoistingParades, Singing patriotic songs, Speech by thePrime MinisterFamily reunions,PicnicsKite flying
The Independence Day of India is celebrated on the fifteenth of August to commemorate its independence from British rule and its birth as a sovereignnation in 1947.[1] The day is a national holiday in India. All over the country, flag-hoisting ceremonies are conducted by the local administration inattendance. The main event takes place in Delhi, the capital city of India, where the Prime Minister hoists the national flag at the Red Fort and delivers a nationally televised speech from its ramparts. In his speech, he highlights the achievements of his government during the past year, raises important issues and gives a call for further development. The Prime Minister also pays his tribute to leaders of the freedom struggle.

Contents

 [hide]

[edit]Background

In 1946, the Labour government in Britain, its exchequer exhausted by the recently concluded World War II, and conscious that it had neither the mandate at home, the international support, nor the reliability of native forces for continuing to control an increasingly restless India,[2][3] decided to end British rule of India, and in early 1947 Britain announced its intention of transferring power no later than June 1948.
Map of India before Partition
As independence approached, the violence between Hindus and Muslims in the provinces of Punjab and Bengal continued unabated. With the British army unprepared for the potential for increased violence, the new viceroy,Louis Mountbatten, advanced the date for the transfer of power, allowing less than seven months for a mutually agreed plan for independence. In June 1947, the nationalist leaders, including Pandit NehruAbul Kalam Azad,Mohammed Ali JinnahB. R. Ambedkar and Master Tara Singh agreed to a partition of the country along religious lines. The predominantly Hindu and Sikh areas were assigned to the new India and predominantly Muslim areas to the new nation of Pakistan; the plan included a partition of the provinces of Punjab and Bengal.
Many millions of Muslim, Sikh, and Hindu refugees trekked across the newly drawn borders. In Punjab, where the new border lines divided the Sikh regions in half, massive bloodshed followed; in Bengal and Bihar, where Mahatma Gandhi's presence assuaged communal tempers, the violence was more limited. In all, anywhere between 250,000 and 500,000 people on both sides of the new borders died in the violence.[4] On 14 August 1947, the new Dominion of Pakistan came into being, with Muhammad Ali Jinnah sworn in as its first Governor General in Karachi. At the stroke of midnight, as India moved into August 15, 1947, Jawaharlal Nehru, read out the famous Tryst with destiny speech proclaiming India's independence.India, now a smaller Union of India, became an independent country with official ceremonies taking place in New Delhi, and with Jawaharlal Nehru assuming the office of the first prime minister, and the viceroy, Louis Mountbatten, staying on as its first Governor General.

[edit]Celebrations

The Indian flag at Delhi Gate
The Prime Minister of India hoists the Indian flag on the ramparts of the historical site, Red Fort (लाल क़िला), Delhi, on August 15. This is telecasted live on the National Channel Doordarshan and many other News Channels all over India. Flag hoisting ceremonies and cultural programs take place in all the state capitals. In the cities around the country the national flag is hoisted by politicians in their constituencies. In various private organisations the flag hoisting is carried out by a senior official of that organisation. Schools and colleges around the country organize flag hoisting ceremonies and various cultural events within their premises, where younger children in costume represent their idols of the Independence era.

[edit]See also

[edit]

Thursday, 11 August 2011

రాజా బాటలో యువరాజా! జగన్ అరెస్టుకు ఆస్కారం


రాజా బాటలో యువరాజా!
జగన్ అరెస్టుకు ఆస్కారం

ఇక ఉక్కు దిగ్బందంలో కడప ఎంపీ..చార్జిషీలు తర్వాత కటకటాలు
మూకుమ్మడి దాడులకు రంగం సిద్ధం..వ్యూహచరనలో సీబీఐ
న్యూఢిల్లీ, హైదరాబాద్ : రాజా.. కనిమొళి! వైఎస్ జగన్ 'చూపిన' బాటలో పయనించారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా.. రాజా, కనిమొళి 'వెళ్లిన' దారిలోనే జగన్ పయనం సాగుతోందా!? ఆయన కూడా జైలు ఊచలు లెక్కించక తప్పదా!? ఇందుకు 'ఔను' అనే అంటున్నారు న్యాయ నిపుణులు. జగన్‌పై క్రిమినల్ కేసు నమోదుకు సీబీఐ అన్ని ఆధారాలను సేకరించిన నేపథ్యంలో.. తొలి చార్జిషీటును దాఖలు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని, దానిని దాఖలు చేసిన తర్వాత ఏ క్షణంలోనైనా జగన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, దర్యాప్తులో భాగంగా ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టు చేయవచ్చని హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించే హక్కు సీబీఐకి ఉంటుందన్నారు. విచారణ సందర్భంగా సీబీఐ కోరిన సమాచారాన్ని ఇవ్వకపోయిన, విచారణకు సహకరించకపోయిన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. విచారణ క్రమంలో సంబంధిత రికార్డులను సీజ్ చేయవచ్చని తెలిపారు.

ప్రాథమిక అభియోగాలను నిర్థారిస్తూ చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలున్నందున నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ ఉంచుతారని 'ఆన్‌లైన్'కు తెలిపారు. ఈ క్రమంలోనే అక్రమ లావాదేవీలు జరిగిన సంస్థల బ్యాంక్ అకౌంట్లను స్తంభింప చేయాలని సీబీఐ కోర్టును కోరవచ్చని తెలిపారు. హైకోర్టుకే చెందిన మరో న్యాయవాది వి.రఘునాథ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా అరెస్టు చేసే ప్రత్యేక అధికారాలు సీబీఐకి ఉంటాయని చెప్పారు. జగన్ కేసులో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయనే అభియోగాలు వచ్చినందున సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండేందుకు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.

మళ్లీ సుప్రీంకు!?
హైకోర్టు తీర్పుపై సీబీఐ అధికారులు ఒకటి, రెండు రోజుల్లో సమావేశమై జగన్‌ను ఉక్కు చట్రంలో దిగ్బంధించేందుకు వ్యూహ రచన చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత రెండు రోజులుగా జగన్ ప్రతినిధులు సుప్రీం న్యాయవాదులతో కీలక సమాలోచనలు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీతో గురువారమే వారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తున్న 2 జీ కుంభకోణం, కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణం, నల్లధనం మొదలైన కేసుల్లో సుప్రీం వ్యాఖ్యలు, తీర్పుల నేపథ్యంలో హైకోర్టు తీర్పును జగన్ సవాలు చేసినా ఒరిగేది ఏమీ ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు. చార్జిషీటు దాఖలైన తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే తమ వద్దకు రావచ్చని సుప్రీం చెప్పే అవకాశాలున్నాయి. అయితే, చార్జిషీటు దాఖలు చేసేందుకు అవసరమైన కీలక సమాచారాన్ని సీబీఐ ఇప్పటికే సిద్ధం చేసిందని, సీబీఐతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కార్పొరే ట్ వ్యవహారాలకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఆదాయ పన్ను శాఖలు, ఇంటెలిజెన్స్ బ్యూరో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కంపెనీలనే కాదు.. మారిషస్, దుబాయ్ కంపెనీలపైనా సీబీఐ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. తమ దాడులను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ శాఖలతో సంయుక్త దర్యాప్తు బృందం (ఎండీఐటీ)ని రూపొందించే విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. వాస్తవానికి, సీబీఐ దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం బినామీ కంపెనీలపై దృష్టి సారించడం.

దేశంలో విమానయాన రంగంతోపాటు అనేక భారీ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న బడా కంపెనీలే రకరకాల బినామీ కంపెనీలను ఏర్పాటు చేయడం, సెల్ కంపెనీలను రంగంలోకి దించడం, తద్వారా జగన్ కంపెనీలకు నిధులు ప్రవహింపజేయడంపై సీబీఐ డేగకన్ను సారించింది. ఇలాంటి కనీసం 20 కేసులు సీబీఐ దృష్టికి వచ్చాయని, వాటి తీగ లాగితే బడా కంపెనీలు కూడా ఇరుక్కు పోతాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన లిస్టెడ్ కంపెనీలపై సెబి ద్వారా దర్యాప్తు జరిపేందుకు కూడా అవకాశాలున్నాయి. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన 56 కంపెనీల్లో పలు సంస్థలు బోగస్‌వని ఐటీ శాఖ ఇప్పటికే నిర్థారణకు వచ్చిది. అలాగే, సాక్షిలో విదేశీ పెట్టుబడులు ఫెమాను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపతోంది.

తీర్పు కాపీ అందాకే కేసు నమోదు: సీబీఐ
హైకోర్టు నుంచి తీర్పు కాపీ అందిన తర్వాతే కేసు నమోదు చేస్తామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. వాస్తవానికి హైకోర్టు తీర్పు కాపీ ఇక్కడి నుంచి న్యూఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్ జనరల్‌కు వెళుతుంది. దానిని ఆయన పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసి విచారణ జరిపే బాధ్యతలను తన కింది స్థాయి సిబ్బందికి అప్పగిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం కేసు నమోదు కావచ్చని తెలుస్తోంది.