Monday, 27 June 2011

DAYAKAR RAO KAMENT ON NAGAM


ఎవరి ఏజెంటో తేలుతుంది
ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధం..
నాగంపై టీడీపీ తెలంగాణ ఫోరం విసుర్లు

హైదరాబాద్, జూన్ 27 : 'ఎవరు పదవుల కోసం కక్కుర్తి పడ్డారో, ఎవరు ఎవరి ఏజెంటో త్వరలో బయటపడుతుంది' అని పరోక్షంగా నాగం జనార్దన్‌రెడ్డిని ఉద్దేశించి టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఏదో ఒక తేదీ ఖరారు చేస్తే నాగంతో బహిరంగ చర్చకు సిద్ధమేనని సవాలు విసిరారు. ఎన్ని తప్పులు చేసినా జై తెలంగాణ అంటే మాఫీ అవుతుందనుకోవడం సరికాదన్నారు. ఎల్.రమణ, మహేందర్‌రెడ్డి, జి.కమలాకర్‌లతో కలిసి సోమవారం టీడీఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. 'ఎవరి అజెండా ఏమిటో త్వరలో బయటపడుతుంది.

తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేయండి. హేళన చేయొద్దు. జగన్‌లా 48 గంటల దీక్ష కాకుండా చిత్తశుద్ధితో చేయండి. జగన్ పెట్టినట్టే పెడుతున్నారు. దేనికోసం, ఏ నాయకత్వం కోసం పనిచేస్తున్నారో ఆయనకు (నాగం) తెలుసు' అని దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. అందరం కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడదామని, తెలంగాణ వారిని తెలంగాణ వారే హేళన చేయడం తగదని అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఎస్సైల నియామకం చేపట్టడం శాసనసభ్యులను అవమానించడమేనన్నారు. 30న తెలంగాణ టీడీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు వివరించారు.

No comments:

Post a Comment