కడప, జూన్ 27 : గ్యాస్, డీజల్, కిరోసిన్ ధరలను అమాంతం పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లో పడవేసి.... విత్తనాలు, ఎరువుల ధర లను పెంచి రైతుల ఉసురు తీసు కుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేతలు జోస్యం చెప్పారు. గ్యాస్, డీజల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ఎదుట కట్టెలతో వంటావార్పు నిర్వ హించారు. అనంతరం ఆటోను బండితో లాగించి నిరసన తెలి పారు.
ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రొద్దుటూరు శాసన సభ్యుడు ఎం.లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు, పేద ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం దారు ణంగా ప్రవరిస్తోందని ఆరోపిం చారు. విత్త నాలు, ఎరువుల ధరలు పెంచి రైతాంగాన్ని వ్యవసా యానికి దూరం చేస్తున్నదని దుయ్యబట్టారు. ట్రాక్టర్‌తో వ్యవ సాయం చేసుకునే వీలు లేకుండా డీజల్ ధర పెంచిన దుర్మార్గపు ప్రభుత్వమని విమర్శించారు. గ్యాస్ ధరలు అమాంతం పెంచి ప్రజలను కట్టెల వంట స్థాయికి చేర్చారని విమర్శించారు.
రైతులు, సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వాలు పతనమవుతాయన్నారు. ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ యుపీఏ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ 21 సార్లు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచిందన్నారు. శవాలపై చిల్లర ఏరుకునే చందంగా పెరిగిన ధరల ద్వారా పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూర్చు కుంటున్నదని దుయ్యబట్టారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పెరిగిన ధరల ద్వారా ప్రజలకు ఇబ్బందులు ఎదురవు తాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం అర్రులు చాస్తున్న దని ఆరోపించారు. ఎరువులు, విత్తనాల ధరలను పెంచి రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నా రని విమర్శించారు.
తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు కుసుమకుమారి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచి... ఇదేమీ పెద్ద భారం కాదని పెట్రోలియం శాఖ మంత్రి జయపాల్‌రెడ్డి చెప్పడం దారుణమ న్నారు. ఆయనకు ధైర్యముంటే ప్రజల మధ్యకు వచ్చి ఈ విధంగా చెప్పాలని అప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో తెలుస్తుందన్నారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్‌బాబు మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో డీజల్‌పై 10 పైసలు పెం చితే అప్పట్లో కాంగ్రెస్ నాయకులు నానా రభస చేశారని, ఇప్పుడు ఏడు సంవత్సరాల్లో 21 సార్లు వంద రూపాయల మేర పెంచినా నోరు మెద పడం లేదని ఆరోపించారు.
గ్యాస్‌ను ప్రజలకు దూరం చేసి కట్టెల వంటకు దారి తీస్తున్న ప్రభుత్వాల తీరుకు ప్రజలు మంటలు రేపి బూడిద చేస్తారని జోస్యం చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ పన్నులను తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. మైదుకూరు పార్టీ కన్వీనర్ సురేష్‌నాయుడు మాట్లాడుతూ ధరలను పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూస్థాపితం కావడం తధ్యమ న్నారు.
టీడీపీ నగర కమిటీ అధ్య క్షుడు బాలకృష్ణయాదవ్, దేశం నేత శశికుమార్, కోడూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి అజయ్‌బాబులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుబ్బలక్షుమ్మ, మహిళ నాయకురాళ్ళు మీనాక్షి, దేశం నేతలు పర్లా రాము, నాసర్, బొమ్మిశెట్టి చంద్రశేఖర్, రమణతో పాటు దేశం శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment